రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న రైతు వేదికల నిర్మాణం రైతులలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు ఆధునిక వ్యవసాయానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
మండలంలోని మామిడిమాడ, పర్వతాపూర్, అప్పారెడ్డిపల్లి రెడ్డి, గణపురం, మానాజిపేట, సోలిపూర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఆయన రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులకు లాభదాయకంగా వ్యవసాయంను అలవాటు చేయాలన్నా ఉద్దేశంతో పలు అధ్యయనాల అనంతరం నియంత్రిత సాగుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు వేసి లాభాలు పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు.
రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతు వేదికల నిర్మాణం ఆధునిక వ్యవసాయానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి