వనపర్తి జిల్లా కేంద్రంలోని మూడు చెరువుల్లో రెండు లక్షల పది వేల చేపపిల్లలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వదిలారు. తెలంగాణలో నీటి విప్లవం కొనసాగుతోందని.. ఇందులో భాగంగానే మత్స్య సంపదను పెంచేందుకే సర్కారు.. ఉచిత చేపపిల్లలను పంపిణీ చేస్తోందని మంత్రి తెలిపారు.
'ఆరోగ్యవంతమైన తెలంగాణకు మత్స్య సంపద ఎంతో ముఖ్యం' - minister singireddy niranjanreddy latest news
వనపర్తి జిల్లా కేంద్రంలోని మూడు చెరువుల్లో చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రెండు లక్షల పది వేల చేపపిల్లలను విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధికి మత్స్య సంపద ఎంతగానో దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
'ఆరోగ్యవంతమైన తెలంగాణకు మత్స్య సంపద ఎంతో ముఖ్యం'
వనపర్తి జిల్లాకు రెండు కోట్ల యాభై లక్షల చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవ్వగా.. ఇప్పటికే కోటి పది లక్షల చేపపిల్లలను జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ భాషా, జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃభైంసాలో చెరువు లక్ష చేపలు మృతి