తెలంగాణ

telangana

ETV Bharat / state

పనులు ఆగితే ఫోన్లో మెసేజ్ పెట్టండి: నిరంజన్ రెడ్డి - వనపర్తి తాజావార్తలు

మిషన్ భగీరథ పథకంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రూ.300 కోట్లతో భారీస్థాయి నీటిశుద్ధి కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Minister Niranjan reddy Establishment of a water treatment plant at a cost of Rs.300 crore in Wanaparthy District
వనపర్తిలో రూ.300 కోట్లతో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు

By

Published : Sep 12, 2020, 3:24 PM IST

వనపర్తి జిల్లా పరిధిలోని ప్రతి అవాసానికి భవిష్యత్తులో రెండు తరాల వరకు తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు శాశ్వతమైన పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 300 కోట్లతో పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా సమీపంలోని గుట్టపై నిర్మాణం చేయనున్న మిషన్ భగీరథ భారీ స్థాయి నీటిశుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు

పనుల్లో ఎక్కడైనా జాప్యం ఏర్పడితే తనకు టెలిఫోన్ ద్వారా సందేశం పంపిస్తే వెంటనే ఆ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు. రాష్ట్రం మొత్తంలో మొదటి దశలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించే జిల్లాల్లో వనపర్తి నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.

వనపర్తిలో రూ.300 కోట్లతో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు

ఇవీచూడండి:సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ

ABOUT THE AUTHOR

...view details