వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద ఉన్న సరళసాగర్ జలాశయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జలపూజ నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 31న తెగిన ఆనకట్టను తిరిగి పునర్నిర్మాణం చేపట్టి వానాకాలంలో 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
సరళాసాగర్ ప్రాజెక్టులో మంత్రి జలపూజ - సరళా సాగర్ ప్రాజెక్టులో మంత్రి పూజ
వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద ఉన్న సరళసాగర్ జలాశయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జలపూజ నిర్వహించారు.
సరళాసాగర్ ప్రాజెక్టులో మంత్రి జలపూజ
కట్ట తెగిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా... వెంటనే స్పందించి మరమ్మతులకు నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, జడ్పీటీసీ కృష్ణయ్య, ఎంపీపీలు పద్మావతమ్మ, మౌనిక, ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.