వనపర్తి జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిరంజన్ రెడ్డి భూమిపూజ - తెలంగాణ వార్తలు
వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. తొలుత కలెక్టరేట్లో బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పర్యటన, వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి
అనంతరం జిల్లా కేంద్రంలో రూ.50 లక్షల వ్యయంతో అధునాతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ నూతన భవనానికి మంత్రి భూమిపూజ చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:ఔరా: కాళ్లతోనే బౌలింగ్.. బ్యాట్స్‌మెన్ పరేషాన్