తెలంగాణ

telangana

ETV Bharat / state

niranjan reddy: 'లేఖ విషయంలో భాజపా నేతలు తోకముడిచారు' - భాజపా నేతలపై మంత్రి నిరంజన్​ రెడ్డి విమర్శలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి లేఖ విషయంలో భాజపా నేతలు తోకముడిచారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐదింటిలోపు సమయమిచ్చినా 2 గంటలకే బండి సంజయ్‌ దీక్ష నుంచి విరమించారని నిరంజన్‌ వనపర్తిలో విమర్శించారు.

niranjan reddy
niranjan reddy

By

Published : Oct 28, 2021, 10:58 PM IST

యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వమే మూడు నెలల కిందట చెప్పిందని మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు నెలల క్రితమే లేఖలు విడుదల చేసిందని... ఆ విషయాన్ని మభ్యపెట్టి రాష్ట్రంలో భాజపా దొంగ దీక్షలు చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేక ఇంగ్లీష్​లో ఉండడం వల్ల అర్థం కాకపోతే.. ఇతరులతో చదివించుకోవాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ను ఉద్దేశించి విమర్శించారు.

ధాన్యం కొంటామని కేంద్రం ఇచ్చిన లేఖ ఏదైనా ఉంటే బండి సంజయ్​ ప్రజలకు చూపించాలని.. లేకపోతే రాజీనామా చేస్తానన్న సవాలును స్వీకరించకుండా కేవలం మూడు గంటల్లోనే దీక్ష విరమించారని ఆక్షేపించారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రంలోని 24 గంటల కరెంటు ఇవ్వలేని నాయకులు దీక్షలు చేపట్టడం హాస్యాస్పదమని మంత్రి విమర్శించారు. రైతుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని... అంతకుమించి భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏక్కడైనా ఒక్క పథకమైన అధికంగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

దేశంలోనే అత్యధికంగా వరి పండించే పంజాబ్ రాష్ట్రం నుంచి గత 54 ఏళ్లుగా వరి కొనుగోలు చేస్తూ... ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం కంటే అధికంగా పండిస్తుంటే తెలంగాణ నుంచి కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో భాజపా వైఖరిని కాపాడుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపడుతున్న దొంగ దీక్షలను... రాష్ట్రంలోని రైతులు, ప్రజలు నమ్మబోరని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు పండించే పంటను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్​ స్వయంగా... ప్రధానని పలుమార్లు కోరినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ఇవాళ ఉదయం నేను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​కు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న వేశాను. సాయంత్రం 5 గంటలలోగా మీ ప్రభుత్వాన్ని ఒప్పించి మీ ధాన్యాన్ని మేము కొంటామనే లేఖ తెప్పించండని అడిగాను. రేపు తెలంగాణలో వేసే వరి పంటను కొనడానికి మా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ఒక లేఖ తీసుకురండి. సాయంత్రం 5 గంటల వరకు టైం ఇస్తే.. మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేసి తోకముడిచి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక పక్కా ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే పంటల సాగువిషయమై రైంతాగాన్ని సన్నద్ధం చేస్తున్నాం. -నిరంజన్​ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి.

ఇదీ చూడండి:వేడెక్కిన 'వరి' రాజకీయం... భాజపా, తెరాస సవాళ్లు, ప్రతి సవాళ్లు!

ABOUT THE AUTHOR

...view details