ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రం ఒకటోవార్డులో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే వేయి రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.
'వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతా ముఖ్యమే' - వనపర్తి జిల్లా తాజా వార్త
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతా ముఖ్యమే'
మురికి కాలవలో చెత్త వేయడం వల్ల కాలువలు నిండి మురుగునీటిలో మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి జ్వరాలు రావడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా వ్యాధి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.