వనపర్తి జిల్లా కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనమండలిలో వెల్లడించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. 2021-22 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.
'ఈ ఏడాదిలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తి' - telangana finance minister
వనపర్తి జిల్లా కర్నెతండా ఎత్తిపోతల పథకానికి 2021-22 బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
హరీశ్ రావు, ఆర్థిక మంత్రి
త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. 48 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి 4 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి :అన్నదాతకు వాతావరణం మేం నేర్పుతాం!