రాష్ట్రంలో ప్రతీ మహిళకు బతుకమ్మ చీర అందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చీరల పంపిణీ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఆనందంగా బతుకమ్మ పండగను జరుపుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ రెండు మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతామహంతి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రతి మహిళకూ బతుకమ్మ చీర: మంత్రి నిరంజన్ రెడ్డి - బతుకమ్మ చీరలు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బతుకమ్మ చీరలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చీరల పంపిణీ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
నిరంజన్ రెడ్డి