తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వచ్చిందని పుకార్లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య! - వనపర్తి జిల్లా వార్తలు

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి కరోనా వచ్చిందని ప్రచారం చేయడం వల్ల.. అతడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా పానగల్​ మండల పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద దిక్కు చనిపోవడంతో.. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Man Suicide In Wanaparthy District
కరోనా వచ్చిందని పుకార్లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య!

By

Published : Sep 7, 2020, 6:57 AM IST

వనపర్తి జిల్లా పానగల్​ మండలం కేతేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలాఫిర్​ అనే వ్యక్తి మటన్​ విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత కొద్ది కాలంగా బాలాఫిర్​ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గ్రామంలో కొంతమంది బాలాఫిర్​కు కరోనా వచ్చిందని ప్రచారం చేశారు. ఆ దెబ్బకు బాలాఫిర్​కు గిరాకీ తగ్గిపోయి.. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. మనస్తాపం చెందిన బాలాఫిర్​ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details