తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​తో ఇంటికెళ్లాడు... కారు ప్రమాదంలో మరణించాడు - కారు ప్రమాదం వార్తలు

హైదరాబాద్​లో జీవనం సాగించే వ్యక్తి... లాక్​డౌన్​ నేపథ్యంలో సొంతూరుకు వెళ్లాడు. పట్టణంలోని రోడ్లపై వాహనం నడిపిన అతనికి... సొంతూరు రోడ్లపై పట్టు దొరకలేదు. చివరికి వాహనం నడుపుతూ భయపడి ప్రమాదానికి గురై తనువు చాలించాడు. ఏం జరిగిందంటే..

man-died-in-car-accident-at-gopalpet-in-wanaparthy-district
ఇన్నోవా కారు బోల్తా పడి వ్యక్తి దుర్మరణం

By

Published : Jul 22, 2020, 7:30 AM IST

వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన నరేందర్ గౌడ్ హైదరాబాద్​లో ఇన్నోవా కారు నడుపుతూ జీవనం సాగించేవాడు. లాక్​డౌన్​ నేపథ్యంలో మూడు నెలల క్రితం సొంతూరుకు వచ్చి కుటుంబసభ్యులతో ఉంటున్నాడు.

ఏం జరిగిందంటే...

మంగళవారం రాత్రి 8 గంటలకు కారు తీసుకుని నరేందర్ బయటకు వెళ్లాడు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఆటోను ఢీకొట్టాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత బైక్​ను ఢీ కొట్టాడు.

ఈ ఘటనతో భయపడిపోయి వేగాన్ని పెంచి రహదారిపైకి వెళ్లగా... వాహనం అదుపు తప్పి నీటి గుంతలో పడిపోయింది. నరేందర్ తీవ్రగాయాలతో అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

ABOUT THE AUTHOR

...view details