లాక్డౌన్ దృష్ట్యా వనపర్తి జిల్లాలో శుక్రవారం నుంచి 12 కేజీల బియ్యాన్ని, రూ. 1500లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో కొవిడ్-19 నివారణపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు పంటకోత, విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఇబ్బందులు కలిగించవద్దని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 53 మందికి ఇళ్లలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
సామాజిక దూరాన్ని పాటించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
కరోనా నియంత్రణ కోసం ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో కొవిడ్-19 నివారణపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
![సామాజిక దూరాన్ని పాటించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6556551-376-6556551-1585258138033.jpg)
మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్డౌన్ సమయంలో ధరలు పెంచితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఎంపీ, కలెక్టర్‌తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. కరోనా కట్టడికి జిల్లా అధికారులు చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు.
సామాజిక దూరాన్ని పాటించాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'