తెలంగాణ

telangana

ETV Bharat / state

'కిరాయి మాట్లాడుకుని మధ్యలో వదిలేసి పోయాడు'

వారంతా వలస కూలీలు. దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా సొంత ఊరికి వెళ్లడానికి ఓ లారీని కిరాయి మాట్లాడుకున్నారు. కొంతదూరం రాగానే.. టోల్​గేట్​ ఉందని భయపడి.. కూలీలందరినీ మధ్యలో దించేసి ఊడాయించాడు సదురు లారీ డ్రైవర్.

'కిరాయి మాట్లాడుకుని మధ్యలో వదిలేసి పోయాడు'
'కిరాయి మాట్లాడుకుని మధ్యలో వదిలేసి పోయాడు'

By

Published : Mar 30, 2020, 10:20 AM IST

సొంత ఊరికి తీసుకెళ్తానంటూ.. కిరాయి మాట్లాడుకుని కూలీలను మోసం చేశాడు ఓ లారీ డ్రైవర్. మహారాష్ట్రకు చెందిన పలువురు కూలీలు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. దేశవ్యాప్త లాక్​డౌన్ నేపథ్యంలో వారికి ఉపాధి కరవైంది. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు 80మంది కూలీలు ఒక లారీని రూ. లక్ష 60వేల కిరాయికి మాట్లాడుకుని బయల్దేరారు.

వీరంతా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్దకు రాగానే ముందు టోల్ గేట్ ఉందని భయపడి, కూలీలను బెదిరించి పాలెంలో దించి లారీ డ్రైవర్ వెళ్ళిపోయాడు. రాత్రివేళ కొత్త ప్రదేశంలో చిన్నా, పెద్ద ఆకలితో అలమటించారు. వలస కూలీల బాధలు గుర్తించిన గ్రామస్థులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి భోజనం పెట్టి వారి ఆకలి బాధ తీర్చి ఆదర్శంగా నిలిచారు. భోజనం అనంతరం కూలీలంతా.. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కాలినడకన బయల్దేరి వెళ్లారు.

'కిరాయి మాట్లాడుకుని మధ్యలో వదిలేసి పోయాడు'

ఇవీచూడండి:కరోనా పంజా: భారత్​లో 27కు చేరిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details