ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని సూచించారు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. జిల్లాలోని గోపాల్‌పేటలో భూగర్భ జలాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమంపై అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు.. రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. నీటిని సంరక్షించుకునే పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ హెచ్చరించారు. రైతు సంప్రదాయ పంటలను కాకుండా కొత్త కొత్త వంగడాలను సాగు చేయడం వల్ల అధిక దిగుబడులే కాకుండా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.
భూగర్భజలాలు పెంపొందించుకుందాం.. - collecotr
వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో భూగర్భ జలాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమంపై అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు.. రైతులకు అవగాహన కల్పించారు.
భూగర్భ జలాలు పెంపొందించుకుందాం..