పాలమూరు జిల్లాలోని పల్లె ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే కురుమూర్తి జాతరలో ఆభరణాల ఊరేగింపు అట్టహాసంగా సాగుతోంది. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని ఎత్తైన కొండల్లో కొలువైన స్వామి ఆభరణాల ఊరేగింపు.. గురువారం ఉదయం వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి ప్రారంభమైంది. ముక్కెర వంశ సంస్థానాధీశులతోపాటు భక్తులు స్వామి వారికి చేయించిన విలువైన ఆభరణాలను ఊరేగిస్తున్నారు.
అట్టహాసంగా కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు..
పాలమూరు జిల్లా ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే కురుమూర్తి జాతరలో అత్యంత కీలకమైన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం కన్నులపండువగా జరుగుతోంది. భక్త జనసందోహం మధ్య అమరచింత మండలంలో పద్మశాలి సంఘం సోదరులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అట్టహాసంగా కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు..
ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, భక్త జనసందోహం మధ్య ఊరేగింపు కన్నులపండువగా జరుగుతోంది. స్థానిక పరమేశ్వర స్వామి చెరువు కట్ట వద్ద ఆభరణాలకు పూజ నిర్వహించి.. కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురం మీదుగా ఆలయానికి చేరుకోనున్నారు. అనంతరం ఆభరణాలను కురుమూర్తి స్వామితో పాటు లక్ష్మీ దేవి విగ్రహాలకు అలంకరిస్తారు.
- ఇదీ చూడండి:'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'