వనపర్తి జిల్లా పామాపురం, రామకృష్ణాపురం పరిధిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పామాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1770, రెండో రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1750గా మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ధాన్యం కేంద్రాల్లో విక్రయించిన తరువాత పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - సింగిల్ విండో
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పామాపురంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం