ఎగువన కృష్ణా నది ఉప్పొంగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు భారీ స్థాయిలో వరద వస్తోంది. ఆలమట్టికి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం నమోదవుతోంది. దీంతో నారాయణపూర్‌వైపు క్రమంగా నీటి విడుదల పెంచుతున్నారు. గురువారం రాత్రికి ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 78 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శుక్రవారం ఉదయానికి ఇక్కడి నుంచి జూరాల వైపు 1.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు.
ఉప్పొంగి వస్తున్న కృష్ణమ్మ... జూరాల, తుంగభద్రకు పెరిగిన ప్రవాహం
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద వస్తోంది. ఆలమట్టిలో ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాలకు కూడా కొంత వరద పెరిగింది. తుంగభద్రకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. త్వరలోనే కృష్ణా, తుంగభద్ర ద్వారా భారీ ప్రవాహం శ్రీశైలానికి చేరుకోనుంది.
krishna water
జూరాలకు కూడా కొంత వరద పెరిగింది. మరోవైపు తుంగభద్రకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. కర్ణాటకలోని ఎగువ జలాశయాలన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లే తుంగభద్రకు వదులుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ జలాశయం నిండనుంది. త్వరలోనే కృష్ణా, తుంగభద్ర ద్వారా భారీ ప్రవాహం శ్రీశైలానికి చేరుకోనుంది.
ఇదీ చదవండి:కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం