తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా టీకా కోసం భారీగా క్యూ కట్టిన జనం - వనపర్తిలో వ్యాక్సినేషన్​ వార్తలు

వనపర్తి జిల్లా పెద్దమందడి పీహెచ్​సీకి స్థానిక ప్రజలు పెద్దఎత్తున క్యూ కట్టారు. అందరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలన్న ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల సూచనలతో ఆస్పత్రికి తరలివచ్చారు.

corona vaccination in wanaparthy
కరోనా టీకా కోసం భారీగా క్యూ కట్టిన జనం

By

Published : Apr 10, 2021, 3:55 PM IST

Updated : Apr 10, 2021, 4:22 PM IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కరోనా టీకా వేసుకోవాలంటూ గ్రామాల్లో సర్పంచ్​లు అవగాహన కల్పించడం వల్ల ఒక్కసారిగా ఆస్పత్రులకు క్యూ కట్టారు.

ఒక్కసారిగా ప్రజలు తరలిరావడం వల్ల వారిని వైద్యులు అదుపుచేయలేకపోయారు. అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి టీకా వేశాలు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని అధికారులు, పోలీసులు కోరారు.

మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు సైతం టీకా తీసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో కరోనా పంజా.. ఒకేరోజు 2909 కేసులు

Last Updated : Apr 10, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details