తెలంగాణ

telangana

ETV Bharat / state

సినీనటుడు వరుణ్ తేజ్​కు తృటిలో తప్పిన  ప్రమాదం - వరణ్ తేజ్​

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై తెలుగు వర్ధమాన నటుడు వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సినీనటుడు వరణ్ తేజ్​కు తప్పిన ముప్పు

By

Published : Jun 12, 2019, 8:55 PM IST

Updated : Jun 13, 2019, 6:46 AM IST

సినీనటుడు వరుణ్‌ తేజ్‌ కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. వాహనం దెబ్బతినటం వల్ల వరుణ్‌ తేజ్‌, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంపై వరణ్ తేజ్ స్పందించారు. తామంత క్షేమంగా బయటపడ్డామని, అభిమానులు ఆందోళన చెందవద్దని ట్విట్టర్‌లో కోరారు.

సినీనటుడు వరుణ్ తేజ్​కు తప్పిన ముప్పు

ఇవీ చూడండి: 'భీష్మ'కు కొబ్బరికాయ కొట్టిన నితిన్​-రష్మిక

Last Updated : Jun 13, 2019, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details