వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలాల్లో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పెద్దమందడి మండల పరిధిలోని మోజెర్ల, వెల్టూరు గ్రామాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. మోజెర్ల గ్రామంలో ఎర్రవాగు ఉప్పొంగడం వల్ల వర్షపు నీరు పంటలపై పారింది.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. నిలిచిన రాకపోకలు
గత రెండు మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వనపర్తి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉప్పొంగుతుండటం వల్ల... వర్షపు నీరు పంట పొలాలపై పారుతోంది. జాతీయ రహదారులపై భారీగా వరద నీరు చేరడం వల్ల... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. రాకపోకలకు అంతరాయం
వెల్టూరు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరడం వల్ల అడ్డాకుల మండలం బలిజపల్లి కన్మనూర్ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెల్టూర్, మోజెర్ల గ్రామంలోని ఎస్సీ కాలనీ ఉన్నత పాఠశాల ప్రాంతమంతా.. జలమయంగా మారింది. మోజెర్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మహమ్మద్ హుస్సేన్ చెరువు ఉద్ధృతంగా పారుతుండటం వల్ల చెరువు వెనకాల సాగు చేసిన వరి పంటలు నీట మునిగాయి.