వనపర్తి జిల్లాలో రాత్రి నుంచి ఉదయం వరకూ భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షం కారణంగా వనపర్తి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోకి నీళ్లు చేరి అలుగులు పారుతున్నాయి. వనపర్తి-పెబ్బేరు మధ్య చేపల వాగు పొంగి... ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీరంగాపూర్‌లో రంగసముద్రం జలశయానికి వచ్చే వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల శ్రీరంగాపూర్-నాగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షం... నిలిచిపోయిన రాకపోకలు - wanaparthy district latest news
వనపర్తి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీరు చేరి చెరువులు అలుగు పారుతున్నాయి. వనపర్తి-పెబ్బేరు మధ్య చేపల వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీరంగాపూర్-నాగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షం... నిలిచిపోయిన రాకపోకలు
శ్రీరంగాపూర్ నుంచి నాగరాల సహా మూడు గ్రామాలకు వెళ్లేందుకు వేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. ఫలితంగా మండల కేంద్రం నుంచి ఆ గ్రామాలకు వెళ్లాలంటే.. చుట్టూ 16 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సివస్తోంది. సంకిరెడ్డిపల్లి, రాయినిపేట, అప్పరాలలో వంద ఎకరాల వరి పంట నీట మునిగింది. పానగల్ మండలంలో బుసిరెడ్డిపల్లి-రాయినిపల్లి వాగు పొంగి పొర్లుతోంది. భీమా కాలువలు పొంగి... పొలాల గుండా ప్రవహిస్తున్నాయి.
ఇదీ చూడండి :గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వరల్డ్ ఛాంపియన్