వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాఖపురం గ్రామానికి చెందిన పూజారి నంబి శ్రీనివాసులుపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసులు ఇంటి వద్ద ఉండగా దాడికి పాల్పడ్డారు. భయంతో కేకలు వేయగా దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పూజారిని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
పూజారిపై కత్తితో దాడి చేసిన దుండగులు - పూజారిపై కత్తితో దాడి చేసిన దుండగులు
గుర్తు తెలియని దుండగులు ఓ ఆలయ పూజారిపై కత్తితో దాడి చేసేందుకు యత్నించిన సంఘటన వనపర్తి జిల్లా శాఖపురంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
![పూజారిపై కత్తితో దాడి చేసిన దుండగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3025890-thumbnail-3x2-hatya2334.jpg)
పూజారిపై కత్తితో దాడి చేసిన దుండగులు
TAGGED:
hathya-yathnam