రాష్ట్ర జానపద కళాకారుడైన సాయిచంద్ సోదరుడు, ఆర్మీ జవాన్ క్రాంతికుమార్‌కు మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితమే రిటైర్ అయినా క్రాంతి కుమార్ అనారోగ్యంతో ఇటీవలే మరణించాడు.
ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు - ఆర్మీ జవాన్ సంతాప సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్ క్రాంతి కుమార్ కుటుంబాన్ని రాష్ట్రమంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జరిగిన సంతాప సభలో ఆయనకు నివాళులర్పించారు.
ఆర్మీ జవాన్‌కు నివాళులర్పిస్తున్న మంత్రి హరీశ్ రావు
వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జరిగిన సంతాపసభలో వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. పది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఆర్మీ జవాన్ క్రాంతి కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.