తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులకు చేయూత.. కలెక్టర్​ నిత్యావసరాల పంపిణీ - నిత్యావరసరాల పంపిణీ

వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష దివ్యాంగులకు నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. 74 మందికి వయో వృద్ధుల సంక్షేమ శాఖ నుంచి సరుకులతోపాటు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.

groceries distribution to the handicap people by collector yasmin bhasa in wanaparthy district
దివ్యాంగులకు చేయూత.. కలెక్టర్​ నిత్యావసరాల పంపిణీ

By

Published : Sep 8, 2020, 5:54 PM IST

వనపర్తి జిల్లా ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ యాస్మిన్​భాష హాజరయ్యారు. దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ నుంచి 74 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కరోన కాలంలో వారు నిత్యావసరాలకై అవస్థలు పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. సరకులతోపాటు మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details