వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు. పోలీసులు కవాతు ప్రదర్శన చేస్తూ.. గౌరవ వందనం చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వనపర్తిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - ag minister
వనపర్తిలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర వేడుకలు