పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చెన్నూరులోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించినరెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలోఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను అందజేశారు.
'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం' - latest news on Government's goal is to bring about massive changes in villages
వనపర్తి జిల్లా చెన్నూరులో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'
మొదటి విడత పల్లెప్రగతిలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ రెండో విడతలోనూ చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు శ్రమదానంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. అపరిశుభ్రత కారణంగా వివిధ రకాల జబ్బులు, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని.. రోగాల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'
ఇదీ చూడండి : 'పుర'పోరుకు ఎస్ఈసీ మార్గదర్శకాలు