మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో 11 కృష్ణ పరివాహక గ్రామాల్లోని నదిలో 26 లక్షల చేప పిల్లలలను విడిచిపెట్టారు. చేపలను విక్రయించేందుకు అర్హులైన లబ్దిదారులకు వాహనాలను అందించామన్నారు. అంతకుముందు పెబ్బేరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
'మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వ కృషి' - మంత్రి నిరంజన్ రెడ్డి తాజా వార్తలు
వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో 11 కృష్ణ పరివాహక గ్రామాల్లోని నదిలో 26 లక్షల చేప పిల్లలలను మంత్రి నిరంజన్ రెడ్డి విడిచిపెట్టారు. చేపలను విక్రయించేందుకు అర్హులైన లబ్దిదారులకు వాహనాలను అందించామని మంత్రి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 230 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 123, మహిళా సమాఖ్య ద్వారా 103, మార్కెటింగ్ శాఖ ద్వారా 4, మెప్మా ద్వారా 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
జిల్లాలో ఈ ఏడాది అధికంగా వరి సాగైందని, 3 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, పుర అధ్యక్షురాలు కారుణశ్రీ, ఏడీ రెహమాన్, నాయకులు బుచ్చారెడ్డి, కోదండారెడ్డి, రాములు పాల్గొన్నారు.