వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో నూతన వ్యవసాయ గోదాంను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ గోదాం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. గోదాంలో లక్ష బస్తాల ధాన్యం నిలువ చేసుకోవచ్చని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కూడా పంట కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
'చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది' - గోదాంను ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కరోనా కష్ట కాలంలో కూడా పంట కొనుగోలు చేస్తున్నామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
mla
గత వారమే పంట కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించామని, కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.