తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే - mal tour in wanaparthy

వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలంలో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి హామీ ఇచ్చారు. భారీగా మొక్కజొన్న, ఉల్లి పంట నష్టపోయినట్లు రైతులు ఎమ్మెల్యేకు వివరించారు.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

By

Published : Oct 7, 2019, 7:28 PM IST

Updated : Oct 9, 2019, 2:30 PM IST

వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలంలో... ఆదివారం కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి పరిశీలించారు. పొలాల రైతులను ప్రభుత్య పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 1200 ఎకరాల మొక్కజొన్న, 500 ఎకరాల ఉల్లి పంట నష్టపోయినట్లు రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇంకో నెల రోజులైతే పంట చేతికి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే... వ్వసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడి పరిస్థితి వివరించారు. నష్టం అంచనా వేసి నివేదిక సిద్ధ చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అదికారులు ఉన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
Last Updated : Oct 9, 2019, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details