రంగస్థల నాటక ప్రదర్శనలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న సత్యహరిశ్చంద్రుని పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం జమ్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకంలో ఆయన మెప్పించారు.
సత్యహరిశ్చంద్రుడిగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న..! - తెలంగాణ వార్తలు
వనపర్తి జిల్లా పాన్గల్ మండలం జమ్మాపురం గ్రామంలో ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకంలో ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న మెప్పించారు. కందనూలు కళా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నాటక ప్రదర్శనలో హరిశ్చంద్రుని పాత్రను పోషించి కళా రంగంపై తనకున్న మక్కువను చాటుకున్నారు.

సత్యహరిశ్చంద్రుడిగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
సత్యహరిశ్చంద్రుడిగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
కందనూలు కళా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నాటక ప్రదర్శనలో హరిశ్చంద్రుడి పాత్రను పోషించి కళా రంగంపై ఆయనకున్న మక్కువను మరోసారి చాటుకున్నారు. రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 3 గంటల వరకు ఆయన పాత్రను అనర్గళంగా కొనసాగించారు.
ఇదీ చదవండి:'తెలుగుజాతి కీర్తి ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్దే'