గాంధీజీ ఆశయ సాధనే లక్ష్యంగా సంకల్పయాత్ర చేపట్టినట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బంగారు శ్రుతి తెలిపారు. వనపర్తిలోని గాంధీ చౌక్‌లోని మహాత్ముడి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించిన శ్రుతి... పట్టణంలో సంకల్పయాత్ర నిర్వహించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందన్నారు. పరిశుభ్ర, ప్లాస్టిక్ రహిత భారత్‌ని ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. యాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు రజిని, వనపర్తి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
'పరిశుభ్ర భారత్ లక్ష్యంగా గాంధీ సంకల్పయాత్ర' - GANDHI SANKALPA YATRA IN WANAPARTHI
వనపర్తిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. పరిశుభ్ర భారత్ నిర్మాణమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతోందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బంగారు శ్రుతి తెలిపారు.
GANDHI SANKALPA YATRA IN WANAPARTHI