వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలోని ఏదుల గ్రామానికి చెందిన బుచ్చన్న పొలం వద్ద పశువులకు మేపడానికి వెళ్లాడు. బుచ్చన్న పొలం పక్కనే ఈదురు గాలులకు తెగిపడిన విద్యుత్ తీగలున్నాయి. అది గమనించని రైతు పశువులను మేపుతూ.. ముందుకు వెళ్లాడు. ముందు వెళ్తున్న ఆవు విద్యుత్ షాక్కు గురై గిలగిల కొట్టుకుంది. ఆవును గమనించిన రైతు.. కంగారులో ఆవును రక్షించేందుకు ముందుకు వెళ్లి కరెంటు తీగ తగలడం వల్ల షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
కరెంటు కాటు.. ఆవు, రైతు మృతి
ఈదురు గాలులకు తెగిన విద్యుత్ తీగలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. కరెంట్ షాక్తో విలవిలలాడుతున్న ఆవును రక్షించేందుకు వెళ్లిన రైతు కూడా కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల గ్రామంలో చోటు చేసుకుంది.
కరెంటు కాటు.. ఆవు, రైతు మృతి
ఆ పక్కనే మరో మేక కరెంట్ షాక్కు గురైన మేక అరుస్తుండగా.. దాని యజమాని చాకచక్యంగా దాన్ని పక్కకు లాగి ప్రాణాలతో కాపాడడం వల్ల మరో రెండు ప్రాణాలు విద్యుత్ షాక్ నుంచి తప్పించుకున్నాయి.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం