తెలంగాణ

telangana

ETV Bharat / state

రామన్​పాడు జలాశయంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం! - వనపర్తి జిల్లాలో మత్స్యకారుడు అదృశ్యం

వరుస వర్షాలతో నిండిన రామన్​పాడు చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతై.. శవమై దొరికిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఆగష్టు 19న జలాశయంలో గల్లంతైన నాగరాజు.. 20న శవమై తేలాడు. పోలీసులు నాగరాజు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

Fisher Man Dead body Found In Ramanpadu reservoir in Wanaparthy District
రామన్​పాడు జలాశయంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం!

By

Published : Aug 20, 2020, 11:14 PM IST

వనపర్తి జిల్లా రామన్​పాడు జలాశయంలో గల్లంతైన ఆత్మకూరుకి చెందిన మత్స్యకారుడు నాగరాజు శవమై దొరికాడు. ఎప్పట్లాగే ఆగస్టు 19న రామన్​పాడు జలాశయానికి చేపల వేటకు వెళ్లిన నాగరాజు చీకటి పడినా తిరిగి రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు ఆత్మకూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆత్మకూరు జలాశయంలో గల్లంతైనట్టు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మరుసటి రోజున రామన్​పాడు జలాశయంలో శవమై దొరికాడు. పంచనామా చేసిన పోలీసులు నాగరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details