చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై అత్యాచార కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వనపర్తి జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రారంభించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం చేస్తున్న కృషిలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభించిన హైకోర్ట్ సీజే - highcourt cj latest inauguration
వనపర్తి జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. బాలికలపై అత్యాచార కేసులతో పాటు పోక్సో చట్టం పరిధిలోని కేసుల సత్వర పరిష్కారానికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభించిన హైకోర్ట్ సీజే
సత్వరన్యాయం కోసం ఏర్పాటుచేసిన ఈ కోర్టులు సమర్థవంతంగా పని చేసేలా అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా న్యాయమూర్తి ప్రేమవతి, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మున్నూరు రవీందర్తో పాటు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.