వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులోని రైతు ఆంజనేయులు తల్లి పేర ఎకరా 26 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సర్వే చేయాలంటూ ఆంజనేయులు కొద్ది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపం చెందిన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు... మంటలను ఆర్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు - తహసీల్దార్ చాంబర్లోనే రైతు ఆత్మహత్యాయత్నం
తనకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని... సర్వే చేయమని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్దార్ చాంబర్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు.
![ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4787910-49-4787910-1571371808701.jpg)
ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు
ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు
TAGGED:
Farmer's suicide attempt