వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేరిపల్లి వద్ద పెబ్బేరు- కొల్లాపూర్ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి మద్దతు ప్రకటించారు. జిల్లాలో వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చిన్నారెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తి మండలంలోని పలు గ్రామాల్లో పంట నీట మునిగిందన్నారు.
'రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం' - Chinna reddy on govt
వనపర్తి జిల్లా పెబ్బేరు- కొల్లాపూర్ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షాలకు పంట నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
!['రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం' రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9522241-5-9522241-1605173570838.jpg)
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, నష్టపోయిన రైతులను కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు శ్రమకోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిపించాలని చిన్నారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్, ఎంపీటీసీ స్వామి , రైతులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:బల్దియా పోరుకు సిద్ధమైన పార్టీలు.. మారనున్న వ్యూహాలు
Last Updated : Nov 12, 2020, 4:30 PM IST