వనపర్తి జిల్లా దత్తాయపల్లి గ్రామానికి కల్వకుర్తి ఎత్తిపోతల పంట కాలువ ద్వారా ఏటా సాగునీరు అందేది. కానీ ఈ ఏడాది మాత్రం కాలువ ద్వారా చివరి వరకు నీళ్లు చేరకపోవడంతో గ్రామంలోని కొంత మంది రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. మరో వారం రోజుల్లోపు నీరందకపోతే చేతికొచ్చే దశలో పంట పూర్తిగా ఎండుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అన్నదాతలు పశుగ్రాసంగా పంటను వదిలేస్తున్నారు.
పంట ఎండుతోంది.. సాగునీరు అందించాలని రైతుల ఆవేదన - Wanaparthy district latest news
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట సాగు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతోందని... వనపర్తి జిల్లా దత్తాయపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ద్వారా నీరు వస్తాయని ఆశించి వరి సాగు చేస్తే... తీరా పంట చేతికొచ్చే దశలో చివరి ఆయకట్టుకు నీరు అందక ఎండిపోయే స్థితికి చేరిందని తెలిపారు. కొంత మంది రైతులు ఇప్పటికే పంటను పశుగ్రాసంగా వదిలేస్తున్నారు.
నీరు లేక వరి పంట ఎండిపోతోందని వనపర్తి జిల్లా రైతుల ఆవేదన
గత ఏడాది కల్వకుర్తి ఎత్తిపోతల నీటితో పాటు వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి సమస్య లేకుండా పంటలు పండాయని రైతులు పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, ఎండలు మండిపోవడంతో పంట ఎండుతోందన్నారు. సంబంధిత అధికారులు సమస్యపై దృష్టి సారించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:కులాలను బట్టి గౌరవిస్తున్నారు: ఈటల రాజేందర్