కేఎల్ఐ కాలువ ద్వారా సాగునీరు రాకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని వనపర్తి జిల్లా పానగల్ మండలం వెంగల్లాయిపల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి శివారు పంటలకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సాగునీరు అందడం లేదని రైతుల ఆందోళన - కేఎల్ఐ కాలువ వద్ద రైతుల ఆందోళన
సాగునీరు అందకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని కెఎల్ఐ కాలువ వద్ద వనపర్తి జిల్లా పాన్గల్ మండలం వెంగల్లాయిపల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కాలువ కింద సాగవుతోన్న 400 ఎకరాల పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేఎల్ఐ కాలువ వద్ద రైతుల ఆందోళన
కష్టపడి కాపాడుకుంటోన్న పంటలు సాగునీరు లేకపోవడంతో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని వెంగల్లాయిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలువ కింద 400 ఎకరాల భూమి సాగవుతోందని తెలిపారు. అధికారులు స్పందించి నీటిని వదిలితే తమ పంటలు పండుతాయని వివరించారు.
ఇదీ చదవండి:బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్