తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​ పోసుకోని కుటుంబం ఆత్మహత్య - Family Suicide in wanaparthy district

ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. ఇద్దరు మృతి చెందగా మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Family Suicide in   wanaparthy district
పెట్రోల్​ పోసుకోని కుటుంబం ఆత్మహత్య

By

Published : Jan 2, 2020, 5:25 PM IST

వనపర్తి చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి చెందిన బడికల జయన్న.. ఆయన భార్య వరలక్ష్మి, 17 ఏళ్ల కూతురు గాయత్రి బుధవారం రాత్రి తమ ఇంట్లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయింది

మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ జనరల్‌ ఆసుపత్రికి తరలించేలోపు కూతురు గాయత్రి మరణించింది. చికిత్స పొందుతూ జయన్న మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

పెట్రోల్​ పోసుకోని కుటుంబం ఆత్మహత్య

ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు

ABOUT THE AUTHOR

...view details