స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. వనపర్తి గోపాల్పేట, రేవల్లి, ఖిల్లాఘణపురం మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామ పత్రాలను స్వీకరిస్తున్నారు. అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. నామ పత్రాల్లో నమోదు చేసే వివరాలు పూర్తిగా సరైనవి ఉండాలని పేర్కొన్నారు. ఒకసారి నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు కుదరదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందే పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.
వనపర్తిలో స్థానిక సంస్థలకు నామపత్రాల స్వీకరణ - WANAPARTHY GOPALPET REVALLI KHILLA GHANAPURAM
స్థానిక సంస్థలకు ఎన్నికల వేళ వనపర్తి జిల్లాలో అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.
నామ పత్రాల్లో నమోదు చేసే వివరాలు పూర్తిగా సరైనవి ఉండాలి