వనపర్తి జిల్లాలో నిర్దేశించిన కొలతల ప్రకారం 5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు.
'5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలి' - DUMPING YARD SHOULD BE READY WITHIN 5 DAYS
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తిప్పడంపల్లిలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. అనంతరం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డంపింగ్ యార్డు నిర్వహణ తీరుకు అధికారులపై మండిపడ్డ కలెక్టర్
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె తిప్పడంపల్లిలో పర్యటించారు. మిషన్ భగీరథలో భాగంగా తాగునీటి సరఫరా, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, ఖాళీ స్థలాలు, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ గణేష్ , పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివకుమార్, రాజేశ్వరి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్
TAGGED:
Collector_Program