కష్టకాలంలో అండగా మేమున్నామంటూ కొందరు మానవతా దృక్పథంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పేదలకు దాతలు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు దాతల చేయూత - వనపర్తి జిల్లా కరోనా వార్తలు
లాక్డౌన్ వల్ల ఉపాధిలేక అవస్థలు పడుతున్న పేదలకు దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలోని కొందరు దాతలు4, 5, 11 వార్డుల్లో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పేదలకు దాతల చేయూత
ప్రభుత్వం అందిస్తున్న బియ్యంతో పాటు పప్పు, నూనె, గోధుమపిండి, చింతపండు తదితర సరకులను అందించారు. పట్టణానికి చెందిన విశ్వమోహన్, ఆనంద్ కుమార్, సురేష్, నరోత్తం రెడ్డి, సంధ్య, భరత్ భూషణ్ సహా కొందరు... పేదలకు తమ వంతు సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.