వనపర్తి జిల్లాలోని ఈర్ల తండా, కర్నే తండాలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి... మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన పోచారం
దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయని సభాపతి పోచారం అన్నారు. వనపర్తిలో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన పోచారం
నిరుపేద కుటుంబాల కోసం కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, రెండు పడక గదుల ఇళ్లు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పోచారం తెలిపారు. వనపర్తి జిల్లాలకు కృష్ణా జలాలను తీసుకోరావడంలో నిరంజన్ రెడ్డి పాత్రను ఆయన కొనియాడారు.
ఇవీ చూడండి:కారును ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి