వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రం పరిధిలో చేపట్టిన రహదారి విస్తరణ పనులను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
'రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి' - వనపర్తి జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు
వచ్చే నెల మెుదటి వారం నుంచి రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కలెక్టర్ కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాతో కలిసి కొత్తకోట మున్సిపల్ కేంద్రం పరిధిలో చేపడుతోన్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.
జనవరి 6 నుంచి మున్సిపల్ పరిధిలో చేపడుతోన్న రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని అధికారులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశించారు. రహదారికి ఇరువైపుల మురుగు కాల్వల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. దుకాణాల యజమానుల, కౌన్సిలర్ల సహకారం తీసుకొని త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. బాటసారులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పురపాలక అధ్యక్షురాలు సుకేశిని, కౌన్సిలర్లు, కమిషనర్ శ్రీపాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :జనవరి నుంచి వచ్చే మార్పులివీ...