వనపర్తి జిల్లాలోని సరళా సాగర్ జలాశయం సామర్థ్యం పెంచాలని నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజలాపూర్ పెద్ద వాగులో నిర్మించిన నీటి ఆనకట్ట ఎత్తు పెంచాలని.. దీని ద్వారా అదనంగా 1,200 ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని వివరించారు.
'సరళా సాగర్ జలాశయం సామర్థ్యం పెంచండి' - devarakadra mla about sarala sagar project
వనపర్తి జిల్లాలోని సరళా సాగర్ జలాశయం సామర్థ్యం పెంచాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ రావుకు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.
సరళ సాగర్ జలాశయం సామర్థ్యం పెంచాలి
చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామ చెరువు నుండి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం వల్ల జమ్మికుంట, నల్లకుంట, ఎర్రకుంట చెరువులు నింపడం ద్వారా ఆయకట్టు పెరుగుతుందని వివరించారు. గతంలో నిర్వహించిన నీటిపారుదల శాఖ సమావేశంలో పలు సమస్యలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని.. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఈఎన్సీకి వివరించారు.
ఇదీ చదవండి:హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ను నేనే.. జస్టిస్ దీపక్ వర్మ స్పష్టం