తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్ బిల్‌ ఎక్కువ వచ్చిందని.. విద్యుత్ అధికారులను బంధించారు...

వనపర్తి జిల్లాలో విద్యుత్‌ అధికారులను ముందరి తండా గ్రామస్థులు నిర్బంధించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోనే అధికారులను నిర్బంధించారు. విద్యుత్‌ బిల్లులపై అదనపు భారం వేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

Detention of vidyuth officers by mudari thanda villagers in wanaparthy district
కరెంట్ బిల్‌ ఎక్కువ వస్తోందని.. విద్యత్ అధికారుల నిర్బంధం

By

Published : May 6, 2022, 6:52 PM IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ముందరి తండాలో విద్యుత్‌ అధికారులను పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్బంధించారు. విద్యుత్‌ బిల్లులపై అదనపు భారం మోపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో బిల్లులు వేస్తే తమకు చెల్లించే స్తోమత లేదని వాపోతున్నారు. అధికారులు మాత్రం కరెంట్‌ చౌర్యం చేస్తుండగా విజిలెన్స్‌ అధికారులు వేసిన జరిమానాను వసూలుచేసేందుకు వస్తే చెల్లించకుండా నిర్బంధించారని చెబుతున్నారు.

కరెంట్ బిల్‌ ఎక్కువ వస్తోందని.. విద్యత్ అధికారుల నిర్బంధం

85వేల బిల్లు నాకు వచ్చింది. ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ప్రతినెల కట్టినా.. కానీ ఇంత బిల్లు రావడం ఏంటి? మీటర్ తీసుకున్నప్పటి నుంచి రెగ్యులర్‌గా కడుతున్నాం.. కానీ గ్రామంలో అందరికీ ఎక్కువ బిల్లులు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details