రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్)పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్పగించాల్సిన బియ్యం కోటాను సకాలంలో అందించాలని సంబంధిత మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్‌రావు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లు.. రావాల్సిన బియ్యం గురించి ఆరా తీశారు. నాలుగు రోజుల కిందట వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని ఓ రైసుమిల్లు యజమాని దగ్గర 15వేల ధాన్యం బస్తాలను అక్రమంగా నిల్వ చేసిన విషయం అధికారుల తనిఖీల్లో వెలుగులోకి రావడం వల్ల ఆ శాఖ అధికారులు అప్రమత్తమై వారికి కేటాయించిన వాటి వివరాలు సేకరిస్తున్నారు. కేటాయించిన కోటా బియ్యాన్ని అప్పగించాలంటూ మిల్లుల యజమానులను అధికారులు ఆదేశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2019-20 వానాకాలం, యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యం దిగుబడులను మిల్లింగ్ కోసం పౌరసరఫరాలశాఖ ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయా రైస్‌మిల్లులకు కేటాయించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా.. వచ్చిన బియ్యాన్ని ఈ నెలాఖరు నాటికి అప్పగించాలంటూ గడువు విధించారు. మిల్లర్లకు కేటాయించిన ఈ కోటాలో ఇప్పటి వరకు కేవలం 40 శాతానికి మించి బియ్యాన్ని అప్పగించలేదని ఆయా జిల్లాల పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఉడకబెట్టిన (బాయిల్డ్ రైస్) బియ్యాన్ని అప్పగించేందుకు నవంబరు ఆఖరు వరకు గడువుంది. ముడి (రా రైస్) బియ్యానికి సంబంధించిన గడువు పూర్తయినా, కరోనా నేపథ్యంలో ఆగస్టు చివరి వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ రైస్‌మిల్లుల నుంచి పౌరసరఫరాల శాఖకు 1.93 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఇందులో బాయిల్డ్ రైస్ 1.82 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, రా రైస్ 10 వేల మెట్రిక్ టన్నులకుపైగా ఉంది. గతేడాది వానాకాలం, యాసంగికి సంబంధించిన బియ్యాన్ని ఆయా మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. బాయిల్డ్ రైస్ అప్పగించడంలో మహబూబ్‌నగర్ జిల్లా మిల్లర్లు పెద్దఎత్తున పెండింగులో పెట్టారు. రా రైస్‌ను అప్పగించడంలో వనపర్తి జిల్లా మిల్లర్లు భారీ ఎత్తున బకాయిపడ్డారని అధికారులు పేర్కొంటున్నారు.
నాగర్‌కర్నూల్ సమీపంలోని ఓ మిల్లులో ధాన్యం