తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలువలో దొరికిన మొసలిని జూరాలలో వదిలేశారు - జూరాల ఎడమ కాలువలో మొసలి లభ్యం

జూరాల ఎడమ కాలులో దొరికిన మొసలిని అటవీ అధికారులు పట్టుకొని జలాశయంలో వదిలేశారు. ఎక్కడైనా మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, పొలాల వద్ద కాపలా ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

crocodile caught in jurala left canal and leave in jurala project
కాలువలో దొరికిన మొసలిని జూరాలలో వదిలేశారు

By

Published : Apr 24, 2020, 3:12 PM IST

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం సమీపంలోని జూరాల ఎడమ కాలువలో మొసలి లభ్యమైంది. ఉదయం పంట పొలాలకు వెళ్తున్న రైతులకు కాల్వలో మొసలి కనిపించింది. వెంటనే తహసీల్దార్​ శాంతిలాల్​, ఎస్సై అబ్దుల్ ఖాదర్​కు సమాచారమిచ్చారు. తహసీల్దార్ సమాచారంతో అటవీ శాఖ అధికారులు వచ్చి మొసలిని బంధించారు.

అటవీ రెేంజ్​ అధికారి ఓంకార్, సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ రెడ్డి, రైతులు, యువకుల సాయంతో మొసలిని బంధించి, జూరాల జలాశయంలో వదిలి పెట్టారు. ఎక్కడైనా మొసళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పొలాల వద్ద కాపలా ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాలువలో దొరికిన మొసలిని జూరాలలో వదిలేశారు

ఇదీ చూడండి:మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ

ABOUT THE AUTHOR

...view details