మూడ్రోజులుగా కురుస్తున్న వానలకు జూరాల కాలువ నుంచి వచ్చిన మొసలి కలకలం సృష్టించిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఉదయం పొలానికి వెళ్తున్న రైతులు గుర్తించి స్థానికులను అప్రమత్తం చేశారు. గ్రామ యువకుల సాయంతో మొసలిని తాళ్లతో బంధించి అటవీశాఖకు సమాచారం అందించారు.
రంగాపురంలో మొసలి కలకలం.. కృష్ణా నదిలో వదిలిన అటవీ అధికారులు - heavy rain in wanaparthy district
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల కాలువ నుంచి మొసలి గ్రామంలోకి వచ్చిందని స్థానికులు తెలిపారు.
రంగాపురంలో మొసలి కలకలం
గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. మొసలిని కృష్ణాన నదిలో వదిలిపెట్టారు. కాలువలు, జలాశయాల సమీపాన ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.