వనపర్తి, కొత్తకోట మున్సిపాలిటీల్లో జరగబోయే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 15 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేశారు.
వనపర్తి, కొత్తకోట పురపాలికల్లో లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - వనపర్తి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు
వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపును కొత్తకోట జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు.
వనపర్తి, కొత్తకోట పురపాలికల్లో లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
3 వార్డులకు ఒక హాల్ చొప్పున ఐదు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కౌంటింగ్ సిబ్బందికి ఎంపీడీఓ కతలప్ప వివరించారు.
15 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు మొత్తం 100 మంది అధికారులు ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు.
- ఇదీ చూడండి : రేపు సాయంత్రంలోగా రానున్న మున్సిపల్ ఫలితాలు